ఆ వర్గం మహిళలకు జగనన్న షాక్ !
అన్నలా ఆదుకుంటానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మడమ తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆ కేటగిరి కిందకి వచ్చే మహిళలకు ప్రభుత్వం షాకిచ్చింది. ఆసరా లేని ఒంటరి మహిళలకు వైసిపి ప్రభుత్వం నెలనెలా పింఛన్ ఇస్తోంది. వివాహం కాని మహిళలకు, భర్తనుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు నెలకు రూ.2500 పింఛను ఇస్తుండగా తాజాగా అర్హత నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం..భర్తను వదిలేసినా లేక భర్తే వదిలేసినా యేడాది […]
అన్నలా ఆదుకుంటానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మడమ తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆ కేటగిరి కిందకి వచ్చే మహిళలకు ప్రభుత్వం షాకిచ్చింది. ఆసరా లేని ఒంటరి మహిళలకు వైసిపి ప్రభుత్వం నెలనెలా పింఛన్ ఇస్తోంది. వివాహం కాని మహిళలకు, భర్తనుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు నెలకు రూ.2500 పింఛను ఇస్తుండగా తాజాగా అర్హత నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం..భర్తను వదిలేసినా లేక భర్తే వదిలేసినా యేడాది వరకూ ఎటువంటి పింఛను పొందలేరు. యేడాది గడిచిన తర్వాతే పింఛన్ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకూ 35 యేళ్లు దాటిన ఒంటరి మహిళలకు ఈ సౌకర్యం కల్పిస్తుండగా ఇకపై దరఖాస్తు చేసుకునే వారిలో 50 యేళ్ళు దాటిన వారికే ఈ పింఛను పొందేందుకు అర్హత లభిస్తుంది. తాము ఒంటరిగా ఉంటున్నామనే ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈమేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే వివాహం కాని మహిళలకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. గ్రామీణప్రాంతాల్లో వివాహం కాని మహిళల అర్హత వయసు 30 యేళ్ళు కాగా దానిని 50 యేళ్ళకు పెంచింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని అవివాహితుల అర్హత వయసును కూడా 35యేళ్ళ నుంచి 50 యేళ్ళకే పెంచింది. దీంతో పాటు వీరికి కుటుంబం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని రుజువు చేసుకోవాలని నిబంధన విధించింది. అలాగే పెళ్ళి కాలేదని రుజువు చేసుకునేందుకు తహసిల్దార్ నుంచి సర్టిపికెట్ సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా నిబంధనలు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి వర్తిస్తాయని తెలిపింది. అయితే ఇప్పటికే చాలా మంది ఒంటరి మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త నిబంధనల వల్ల వీరిలో చాలా మంది పింఛన్ రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒంటరి మహిళల విభాగంలో ఇప్పటివరకు 1,88,062 మంది పింఛన్ పొందుతున్నారు.