Telugu Global
NEWS

దేశంలోనే తొలిసారిగా.. తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్ర‌య‌త్నం

ఆథునిక సాంకేతిక ప‌రిజ్ణానానికి తెలంగాణ స‌ర్కార్ పెద్దపీట వేస్తోంది. అన్ని విభాగాల్లో సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌మిస్తూ పాల‌నా సౌల‌భ్యాన్ని పెంచుతోంది. తాజాగా ఆర్టీసీ లో కొత్త సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తోంది. ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లందించేందుకు ఈ విధానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా బస్సుల్లో ఐ-టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ […]

TS-RTC-New-Technology
X

ఆథునిక సాంకేతిక ప‌రిజ్ణానానికి తెలంగాణ స‌ర్కార్ పెద్దపీట వేస్తోంది. అన్ని విభాగాల్లో సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌మిస్తూ పాల‌నా సౌల‌భ్యాన్ని పెంచుతోంది. తాజాగా ఆర్టీసీ లో కొత్త సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తోంది.

ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లందించేందుకు ఈ విధానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా బస్సుల్లో ఐ-టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్)లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఈ త‌ర‌హా సౌక‌ర్యం తెలంగాణ‌లోనే ప్రారంభించారు. దీని వ‌ల్ల ప్రయాణానికి 20 నిమిషాల ముందుగానే బస్సులో సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోనే సౌక‌ర్యాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

అంతేకాకుండా, బస్సు ఎక్కడ ఉంది.. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి? తాము ఉన్న బ‌స్టాప్ కి రావడానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలన్నీ ఐ-టిమ్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా టికెట్ ఛార్జీలను చెల్లించడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే 228 ఐ-టిమ్‌లు కొన్నట్లు అధికారులు తెలిపారు. మొదట ఏసీ బస్సుల్లో ఐ-టిమ్‌లను దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వీటిని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే, పుష్పక్ బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. అనంతరం దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలు చేసి, దశలవారీగా అన్ని సర్వీసుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. జులై నెలలో కరీంనగర్ రీజియన్‌లో గరుడ, గరుడప్లస్, రాజధాని, ఇంద్ర లాంటి సర్వీసుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

First Published:  18 Jun 2022 3:24 AM GMT
Next Story