Telugu Global
NEWS

రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత… రైల్వే స్టేషన్ పై దాడికి యత్నం…పోలీసు లాఠీ చార్జ్

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిన్న సికిందరాబాద్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. వరంగల్ లో కొద్ది సేపటిక్రితం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. వందలాది మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆవేశంగా ఉన్న యువకులు నరేంద్ర మోడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగారు. అంతిమ యాత్ర వరంగల్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే […]

రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత… రైల్వే స్టేషన్ పై దాడికి యత్నం…పోలీసు లాఠీ చార్జ్
X

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిన్న సికిందరాబాద్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారు.

వరంగల్ లో కొద్ది సేపటిక్రితం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. వందలాది మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆవేశంగా ఉన్న యువకులు నరేంద్ర మోడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగారు. అంతిమ యాత్ర వరంగల్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే యువత పెద్దఎత్తున రైల్వే స్టేషన్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. రాకేష్ మృతదేహాన్ని స్టేషన్ లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు.అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు యువకులను అడ్డుకున్నారు.

Stone Attack On BSNL Office In Warangal - Sakshi

యువకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాటజరిగింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న యువకులు, టీఆరెస్, కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ రైల్వే స్టేషన్ ముందు టైర్లు తగలబెట్టారు. వీళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆందోళనకారులు నరేంద్ర మోడీ, అమిత్ షాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇంకా వరంగల్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

మరో వైపు ఆందోళనకారులు బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

కాగా మరి కొద్ది సేపట్లో రాకేష్ మృతదేహం నర్సంపేటకు చేరుకోనుండటంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

First Published:  18 Jun 2022 1:47 AM GMT
Next Story