మళ్లీ ఓట్ల మేనేజ్‌మెంట్‌పై బాబు లెక్చర్
అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేయడం ఎలా ?. ఓటర్లను లొంగదీసుకోవడం ఎలా అన్న దానిపై ఒక పుస్తకాన్నే ప్రచురించేందుకు సిద్ధమైన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కూడా పద్దతి మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. తాజాగా ఆయన మరోసారి ఓటర్లను మేనేజ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై స్పీచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ […]
అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేయడం ఎలా ?. ఓటర్లను లొంగదీసుకోవడం ఎలా అన్న దానిపై ఒక పుస్తకాన్నే ప్రచురించేందుకు సిద్ధమైన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కూడా పద్దతి మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. తాజాగా ఆయన మరోసారి ఓటర్లను మేనేజ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లిలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై స్పీచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ రెడీ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో 25వేల మంది ఓటర్లను ప్రభావతం చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్న వారినీ గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలు మనందరికీ చాలా కీలకమని, చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటరు మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
కార్యకర్తల నుంచి నాయకుల వరకు వారి పనితీరును ఆన్‌లైన్‌లో గూగుల్ ద్వారా ట్రాకింగ్ చేస్తామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను దగ్గరకు రానివ్వరన్న అపవాదు ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి కార్యకర్తలను దువ్వే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు పార్టీ కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తున్నారని.. ఎన్నికల సమయంలో కొత్త వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. అప్పటి వరకు పనిచేసిన కార్యకర్తలను పక్కన పడేసి కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని, దాని వల్ల నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని.. ఇకపై ఆ ఇబ్బంది రాకుండా పనిచేసే వారిని స్వయంగా తానే గుర్తిస్తానని హామీ ఇచ్చారు.
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వంద ఓటర్లకు ఒక సెక్షన్ చెప్పున మొత్తం 4.5 లక్షల మందితో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలన చేయిస్తామని.. ఒక్క టీడీపీ సానుభూతిపరుడు ఓటుకూడా మిస్ అవడానికి వీల్లేదన్నారు చంద్రబాబు.