సికింద్రాబాద్ ఘటనతో మాకు సంబంధం లేదు. – వెంకట్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెందగా సుమారు 13 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టంచేశారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెందగా సుమారు 13 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టంచేశారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉన్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పనులకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడదని వెంకట్ తెలిపారు. ఈ ఉదయం తాను ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కు వెళ్తుండగా పోలీసులు తనను అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పారు. అక్కడి నుంచి షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని చెప్పారు. అందుకే పోలీస్ స్టేషన్ నుంచే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.