Telugu Global
NEWS

కొత్త రాజ్యసభ ఎంపీల్లో తెలుగువారికే ఎక్కువ ఆస్తులు, అప్పులు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 57 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరందరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే అత్యంత ఆస్తిపరులు, అప్పులు ఉన్నవారిగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదిక విడుదల చేసింది. ఎలాంటి పార్టీలతో సంబంధం లేని, పక్షపాతం లేని ఒక సలహా సంస్థనే ఏడీఆర్. కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు […]

new-elected-rajya-sabha-mps-from-telugu
X

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 57 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరందరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే అత్యంత ఆస్తిపరులు, అప్పులు ఉన్నవారిగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదిక విడుదల చేసింది. ఎలాంటి పార్టీలతో సంబంధం లేని, పక్షపాతం లేని ఒక సలహా సంస్థనే ఏడీఆర్.

కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని పేర్కొంది. అంతే కాకుండా వీరిలో 12 మంది ఎంపీలు చాలా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు తెలిసింది. హత్య, హత్యాప్రయత్నం, దొంగతనం వంటి కేసుల్లో వీరు ఉన్నట్లు వివరించింది. తెలంగాణకు చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తమ రిపోర్టులో పేర్కొంది.

ఇక 57 మందిలో.. 22 మంది బీజేపీ, 9 మంది కాంగ్రెస్, నలుగురు వైఎస్ఆర్‌సీపీ, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు తమకు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ. 154.27 కోట్లుగా పేర్కొంది. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ. 18 కోట్లు, కాంగ్రెస్ రూ. 62.89 కోట్లు, వైసీపీ రూ. 88 కోట్లు, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీల సగటు ఆస్తులు రూ. 2,712 కోట్లుగా వెల్లడించింది. అలాగే 22 మంది ఎంపీలు తమకు రూ.1 కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. 57 మందిలో కేవలం 10 మంది అనగా 18 శాతం మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు.

టీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి తనకు రూ. 5,300 కోట్ల ఆస్తులు, ఏడాదికి రూ. 140 కోట్ల ఆదాయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన కపిల్ సిబాల్‌కు రూ. 608 కోట్ల ఆస్తులు, రూ. 61 కోట్ల ఆదాయం ఉన్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావుకు రూ. 243 కోట్ల ఆస్తులు, రూ. 17 కోట్ల ఆదాయం ఉన్నట్లు వివరించారు. ఇక కపిల్ సిబాల్‌కు రూ. 92 కోట్లు, మస్తాన్‌రావుకు రూ. 69 కోట్లు, దామోదర్‌రావు‌కు రూ. 49 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఆస్తుల్లో బండి పార్థసారథి అగ్రస్థానంలో, అప్పుల్లో మస్తాన్‌రావు, దామోదర్‌రావు రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.

First Published:  17 Jun 2022 4:15 AM IST
Next Story