Telugu Global
NEWS

కేంద్రంపై విరుచుకుపడ్డ కేటీఆర్

ఆర్మీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వేల మంది యువకులు కర్రలు చేతబట్టి ర్యాలీ చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలను బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం తీసుకుని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా యువత […]

ktr-fires-modi
X

ఆర్మీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వేల మంది యువకులు కర్రలు చేతబట్టి ర్యాలీ చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలను బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం తీసుకుని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమన్న విషయాన్ని మరిచిపోయి ఏకపక్షంగా, నియంతల్లా నిర్ణయాలుతీసుకోవడం వల్లనే ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే పునర్‌సమీక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతు చట్టాలు రైతులకు అర్థం కాలేదు, వ్యాపారులకు జీఎస్‌టీ అర్థం కాలేదు, సామాన్యుడిని నోట్ల రద్దు అర్థం కాలేదు, ముస్లిములకు సీఏఏ అర్థం కావడం లేదు, గృహిణులకు ఎల్‌పీజీ ధరలు అర్థం కావడం లేదు, ఇప్పుడు యువతకు అగ్నివీర్‌ అర్థం కావడం లేదంటూ కేటీఆర్‌ మరో ట్వీట్ చేశారు.

First Published:  17 Jun 2022 3:40 PM IST
Next Story