Telugu Global
NEWS

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తోంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై తెల్లవారుజామునే ఈడీ రైడ్ చేసింది. ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుంది. రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. లోపలివారు బయటకు, బయటి వారు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు బస్సులు,లారీల వ్యాపారమే కాకుండా విదేశాల్లోనూ వ్యాపారాలున్నాయి. […]

ED-Ride-Jc-Prabhakar-reddy-Home
X

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తోంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై తెల్లవారుజామునే ఈడీ రైడ్ చేసింది. ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుంది. రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. లోపలివారు బయటకు, బయటి వారు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు బస్సులు,లారీల వ్యాపారమే కాకుండా విదేశాల్లోనూ వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏ వ్యవహారంలో ఈడీ మెరుపుదాడులకు దిగింది అన్న దానిపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. సెల్‌ఫోన్లు తీసేసుకోవడం, ఇంటి నుంచి బయటకు ఎవరూ వచ్చేపరిస్థితి లేకపోవడంతో ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. ఈడీ దాడుల విషయం తెలుసుకున్న జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు వస్తున్నారు.

First Published:  16 Jun 2022 5:00 PM
Next Story