Telugu Global
NEWS

పుట్టగానే ఆధార్.. తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్..

ఆధార్ అందరికీ తప్పనిసరి, అయితే ఆధార్ కార్డ్ కావాలంటే.. ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. దరఖాస్తు తీసుకుని ఆధార్ సెంటర్లకు వెళ్లి అక్కడ ఫొటో దిగి ఆ తర్వాత కార్డ్ కోసం వెయిట్ చేయాలి. నెలల చిన్నారులకు ఆధార్ తీసుకోవడం చాలామంది తల్లిదండ్రులకు ఇబ్బంది. కానీ ఏ పథకానికైనా ఆధార్ తప్పనిసరి కావడంతో చిన్నారులను తీసుకుని కూడా ఆధార్ సెంటర్లకు వస్తుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడిలాంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. పుట్టిన ప్రతి బిడ్డకు ఆస్పత్రిలోనే ఆధార్ […]

పుట్టగానే ఆధార్.. తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్..
X

ఆధార్ అందరికీ తప్పనిసరి, అయితే ఆధార్ కార్డ్ కావాలంటే.. ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. దరఖాస్తు తీసుకుని ఆధార్ సెంటర్లకు వెళ్లి అక్కడ ఫొటో దిగి ఆ తర్వాత కార్డ్ కోసం వెయిట్ చేయాలి. నెలల చిన్నారులకు ఆధార్ తీసుకోవడం చాలామంది తల్లిదండ్రులకు ఇబ్బంది. కానీ ఏ పథకానికైనా ఆధార్ తప్పనిసరి కావడంతో చిన్నారులను తీసుకుని కూడా ఆధార్ సెంటర్లకు వస్తుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడిలాంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. పుట్టిన ప్రతి బిడ్డకు ఆస్పత్రిలోనే ఆధార్ నెంబర్ కేటయించబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆస్పత్రి, జహీరాబాద్ లోని ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు.

అప్పుడే పుట్టిన చిన్నారులకు ఆధార్ కార్డ్ ఇవ్వడంకోసం తల్లి వేలిముద్రను తీసుకుంటారు. శిశువు ఫొటోను కూడా పోర్టల్ లో అప్లోడ్ చేసి.. తాత్కాలిక యూఐడీ నెంబర్ కేటాయిస్తారు. ఈ ఎన్రోల్ మెంట్ ఐడీ ఆధారంగా 45 రోజుల లోపు మీసేవా కేంద్రాల్లో శిశువు పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న తర్వాత ఆన్ లైన్ లో ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పుట్టిన పిల్లల ఆధార్ కోసం ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఇంటి వద్దకే ఇక ఆధార్ సేవలు..
ఆధార్ కార్డ్ కోసం చిన్నారులను ఆధార్ లేదా మీ సేవా సెంటర్లకు తీసుకెళ్లడం, అక్కడ క్యూలైన్లలో వేచి చూడటం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతోంది. ఇకపై దీన్ని నివారించేందుకు ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దే ఆధార్ సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. సమీపంలోని పోస్ట్ ఆఫీసులో సమాచారం ఇచ్చినా, లేదా పోస్ట్ మెన్‌ కు ఫోన్ చేసినా.. వారే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఆధార్ తీసుకోవాలనుకుంటే.. పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలను పోస్టల్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా పోస్టల్ సిబ్బంది ఆధార్ కార్డ్ ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ సేవలను పోస్టల్ శాఖ ఉచితంగా అందించబోతోంది.

First Published:  17 Jun 2022 6:08 AM IST
Next Story