Telugu Global
NEWS

ఎన్నికల సీజన్లో వైసీపీ పొలిటికల్ మూవీస్..

2019 ఎన్నికల ఏడాదిలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించారు. కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లతో ఎన్టీఆర్ బయోపిక్స్ వచ్చాయి. ఆ సినిమాలకు ఎలాంటి స్పందన వచ్చిందో.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కూడా అలాంటి ఆదరణే దక్కింది. అక్కడ సినిమాలు ఫ్లాప్, ఇక్కడ పొలిటికల్ సీన్ లో టీడీపీ చరిత్రలో ఎరుగని ఘోర పరాభవం చవిచూసింది. ఇక 2024 ఎన్నికల టైమ్ కి టీడీపీ అలాంటి మరో సాహసం చేస్తుందని ఎవరూ అంచనా వేయట్లేదు. […]

YCP-MP-Nandigam-Suresh-Movie11
X

2019 ఎన్నికల ఏడాదిలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించారు. కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లతో ఎన్టీఆర్ బయోపిక్స్ వచ్చాయి. ఆ సినిమాలకు ఎలాంటి స్పందన వచ్చిందో.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కూడా అలాంటి ఆదరణే దక్కింది. అక్కడ సినిమాలు ఫ్లాప్, ఇక్కడ పొలిటికల్ సీన్ లో టీడీపీ చరిత్రలో ఎరుగని ఘోర పరాభవం చవిచూసింది. ఇక 2024 ఎన్నికల టైమ్ కి టీడీపీ అలాంటి మరో సాహసం చేస్తుందని ఎవరూ అంచనా వేయట్లేదు. అయితే ఈసారి వైసీపీనుంచి ఆ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ జగన్ హీరోగా సినిమా వస్తుందనుకుంటే పొరపాటే.. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ జీవిత చరిత్రతో కొత్త సినిమా తెరకెక్కుతోంది. జగన్ అభిమాని అనే పేరుతో సినిమా తీస్తున్నారు. నెలరోజుల్లో సినిమా విడుదల చేస్తామన్నారు ఎంపీ సురేష్.

రాజకీయాల్లోకి రాకముందు నందిగం సురేష్ ఓ సాధారణ ఫొటోగ్రాఫర్. అమరావతి రాజధాని విషయంలో రైతులనుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ జరుగుతున్న సమయంలో సురేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలా ఆయన జగన్ దృష్టిలో పడ్డారు. కట్ చేస్తే.. 2019లో బాపట్ల ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆమాటకొస్తే.. ప్రస్తుతం వైసీపీ తరపున ఎంపీలుగా ఉన్న వారిలో చాలామందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అలాంటివారందర్నీ జగన్ ఏరికోరి రాజకీయాల్లోకి తెచ్చి సరికొత్త ఒరవడి సృష్టించారు. అలా వచ్చిన వారిలో ఎంపీ నందిగం సురేష్ ఇప్పుడు వెండితెరపైకి రాబోతున్నారు.

నందిగం సురేష్ జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీఎం జగన్ సంక్షేమ పథకాలే కాకుండా.. టీడీపీపై కూడా పూర్తి స్థాయిలో సెటైర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే చంద్రబాబు, లోకేష్ పాత్రల్లో ఎవరిని తీసుకున్నారు, ఎలాంటి సీన్లు ఉన్నాయే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఎంపీ నందిగం సురేష్ పుట్టినరోజు సందర్భంగా.. సినిమా అప్డేట్స్ బయటకొచ్చాయి. నెలరోజుల్లోగా విడుదల చేస్తామన్నారు ఎంపీ సురేష్. అమరావతి విషయంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం పై సినిమా నిర్మించామని చెప్పారు.

First Published:  16 Jun 2022 2:57 AM IST
Next Story