Telugu Global
NEWS

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు షాక్.. రూ.10 లక్షల జరిమానా విధించిన లా ట్రైబ్యునల్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ర‌వి ప్ర‌కాష్ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసి ట్రైబ్యున‌ల్‌ రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. కాగా, పిటిష‌న్‌పై సుదీర్ఘ వాదనల విన్న లా ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది. టీవీ9 వాటాల […]

tv9-ravi-prakash-shocked-10-lakhs-fine
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ర‌వి ప్ర‌కాష్ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసి ట్రైబ్యున‌ల్‌ రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, పిటిష‌న్‌పై సుదీర్ఘ వాదనల విన్న లా ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది. టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది.

వాటాల విక్రయ ఒప్పందం గురించి ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని లా ట్రైబ్యునల్ ఆదేశించింది.

First Published:  16 Jun 2022 2:40 AM GMT
Next Story