Telugu Global
NEWS

టీఆర్ఎస్ కీలక నిర్ణయం…. మమతా బెనర్జీ సమావేశానికి దూరం

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే తలంపుతో ఇవ్వాళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావద్దని టీఆరెస్ నిర్ణయించుకుంది. ఢిల్లీలో ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న మమత అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము […]

kcr
X

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే తలంపుతో ఇవ్వాళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావద్దని టీఆరెస్ నిర్ణయించుకుంది.

ఢిల్లీలో ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న మమత అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని ఇటీవలే తేల్చి చెప్పిన టీఆర్ఎస్.. అనుకున్నట్టే ఈ సమావేశానికి వెళ్ళడం లేదు. సమాశానికి హాజరు కావాలా? వద్దా? అన్న విషయమై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. చివరికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తాము సమదూరం పాటిస్తామని, తమ వైఖరేంటో తర్వాత ప్రకటిస్తామని టీఆర్ఎస్ తెలిపింది.

మరో వైపు ఈ రోజు సమావేశం కోసం మమతా బెనర్జీ నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ ప్రతిపక్షనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన అందుకు ఒప్పుకోలేదని సమాచారం

First Published:  15 Jun 2022 2:34 AM IST
Next Story