విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్
విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. తాము ఏర్పాటు చేసే ఐటీ కార్యాలయంలో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్ నాటికి నాలుగు ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్తగా క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ హెచ్‌ఆర్ విభాగం హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెన్నైలో వెల్లడించారు. అందులో విశాఖ ఒకటి. కొత్త క్యాంపస్‌లను […]
విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. తాము ఏర్పాటు చేసే ఐటీ కార్యాలయంలో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్ నాటికి నాలుగు ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్తగా క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ హెచ్‌ఆర్ విభాగం హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెన్నైలో వెల్లడించారు. అందులో విశాఖ ఒకటి. కొత్త క్యాంపస్‌లను టాలెంట్ పూల్ హబ్‌లు అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు.
విశాఖలో కార్యాలయాన్ని మధురవాడ ఐటీ హిల్స్‌లో ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అక్కడ వీలు కాకపోతే విశాలమైన భవనంలో ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందు కోసం ఇప్పటికే అధికారులతో కంపెనీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
ఇన్ఫోసిస్ నిర్ణయంపై రుషికొండ ఐటీ పార్కు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖ బాట పట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచే ఎక్కువ ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే దిగ్గజ కంపెనీలు మొగ్గు చూపకపోవడంతో అనేక ఇతర కంపెనీలు కూడా ఇటువైపు వచ్చేందుకు ఇంతకాలం ఆసక్తి చూపలేదు.
ఇన్ఫోసిస్ ఎంటరైతే ఇతర కంపెనీలు కూడా విశాఖను బెస్ట్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఐటీ ఉద్యోగులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా ఉగ్యోగులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ రాకతో అనేక మంది ఉత్తరాంధ్ర ఐటీ నిపుణులకు అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.