Telugu Global
NEWS

మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై కేసు నమోదయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను మందులకోసం బైటి షాపులకు పంపిస్తున్నారంటూ కొందరు డాక్టర్ల మీద‌ చర్యలు తీసుకోవడంపై మానవ హక్కుల కమిషన్ హరీష్ రావు పై కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఇచ్చిన పిర్యాదు మేరకు హరీష్ రావుపై ఈ కేసు(1187/36/0/2022) నమోదయ్యింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని మందులు లభించడం లేదని, మందులు లేవని తెలిసి కూడా డాక్టర్లు […]

harish rao
X

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై కేసు నమోదయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను మందులకోసం బైటి షాపులకు పంపిస్తున్నారంటూ కొందరు డాక్టర్ల మీద‌ చర్యలు తీసుకోవడంపై మానవ హక్కుల కమిషన్ హరీష్ రావు పై కేసు నమోదు చేసింది.

కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఇచ్చిన పిర్యాదు మేరకు హరీష్ రావుపై ఈ కేసు(1187/36/0/2022) నమోదయ్యింది.

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని మందులు లభించడం లేదని, మందులు లేవని తెలిసి కూడా డాక్టర్లు మందులు బైట కొనుక్కోమని ప్రిస్కిప్షన్ రాసినందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఉచిత మందులను ప్రిస్క్రైబ్ చేయడం లేదంటూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డాక్టర్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు అనవసరంగా డాక్టర్లను బాధ్యులను చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

ఉచిత మందులు లభించకపోవడంతో రోగుల తాలూకు బంధువులు ప్రైవేటు మందుల షాపులకు పరుగులు తీయవలసి వస్తోందన్నారు. అన్ని మందులు ప్రభుత్వమే సప్లై చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేటు మందుల షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని, వాటిని ఎందుకు ప్రోత్సహిస్తోందని ఆయన ప్రశ్నించారు.

వైద్య సదుపాయాలు కల్పించకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ది చేకూర్చేందుకు ఈ ప్రభుత్వం కావాలనే సర్కారీ దవాఖానాలను చిన్నచూపు చూస్తోందన్నారు. పేద రోగులకు ఉచిత మందులు లభించడం లేదని, తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి హరీష్ రావు ప్రభుత్వ డాక్టర్లను బాధ్యులుగా చేస్తూ వారిని తొలగిస్తున్నారని బక్కా జడ్సన్ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ ని పురస్కరించుకుని హెచ్చార్సీ మంత్రి హరీష్ రావుపై కేసు దాఖలు చేసింది.

First Published:  15 Jun 2022 4:58 AM GMT
Next Story