Telugu Global
NEWS

తెలంగాణలో పెరిగిన రేట్లు.. ఏపీఎస్ఆర్టీసీకి మిగులు నోట్లు..

కర్నూలు టు హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ టికెట్ 289 రూపాయలు. ఏసీ బస్సు ఇంద్రలో వెళ్తే 353 రూపాయల టికెట్ తీసుకోవాలి. పొరపాటున ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సీటు దొరక్క, తెలంగాణ బస్సు ఎక్కితే మాత్రం టికెట్ రేటు 445 రూపాయలు. ఏసీ బస్సుకంటే ఎక్కువ రేటు అనమాట. ఈ తేడా తెలిసిన ప్రయాణికులెవరూ తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు సాహసించట్లేదు. రెండు మూడు గంటలు ఆలస్యమైనా.. ఏపీ బస్సు ఎక్కడానికే ఇష్టపడతారు. పోనీ సీటు లేకపోయినా.. […]

rtc-ticket-price-hike-in-telangana-rtc-ti
X

కర్నూలు టు హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ టికెట్ 289 రూపాయలు. ఏసీ బస్సు ఇంద్రలో వెళ్తే 353 రూపాయల టికెట్ తీసుకోవాలి. పొరపాటున ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సీటు దొరక్క, తెలంగాణ బస్సు ఎక్కితే మాత్రం టికెట్ రేటు 445 రూపాయలు. ఏసీ బస్సుకంటే ఎక్కువ రేటు అనమాట. ఈ తేడా తెలిసిన ప్రయాణికులెవరూ తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు సాహసించట్లేదు. రెండు మూడు గంటలు ఆలస్యమైనా.. ఏపీ బస్సు ఎక్కడానికే ఇష్టపడతారు. పోనీ సీటు లేకపోయినా.. వచ్చే స్టాప్ లో ఖాళీ అవుతుందనే ఉద్దేశంతో స్టాండింగ్ జర్నీకి అయినా ఓకే అంటున్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది. అనూహ్యంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా బస్సులన్నీ ఫుల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా పెరిగింది.

వాస్తవానికి రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ డీజిల్ భారాన్ని తగ్గించుకోడానికి రేట్లు పెంచింది. అయితే తెలంగాణలో రేట్లు కాస్త ఎక్కువ పెరిగాయి. పెరిగిన రేట్లతో ఆదాయం పెరగకపోగా, ఏపీ బస్సుల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఆ ఆదాయం అంతా ఏపీఎస్ఆర్టీసీకి పోతోంది. తెలంగాణలో రేట్లు పెరగడం అనూహ్యంగా ఏపీకి వరంగా మారింది. ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీ కూడా చార్జీలు పెంచాలి..

టికెట్ రేట్లలో తేడా వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం వస్తున్నట్టు వాపోతున్నారు అధికారులు. ఆ ఆదాయం అంతా అయాచితంగా ఏపీఎస్ఆర్టీసికి తరలిపోతున్నట్టు గుర్తించారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా రేట్లు పెంచాలని తెలంగాణ అధికారులు ఓ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్‌ రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని కోరారు. అయితే ఈ ప్రపోజల్ కి ఏపీ అధికారులు అంగీకరిస్తారా, ఒకవేళ అంగీకరించకపోతే ఆర్టీసీల మధ్య జరిగిన అంతర్ రాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేనా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికయితే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు పంపించే సర్వీసుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

First Published:  14 Jun 2022 6:05 AM GMT
Next Story