కేటీఆర్ సీక్రెట్ మిషన్! ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఏం తీసిపోదు.
జూన్ 12, 2022 ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ రూ. 24,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే FAB Unit ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది అన్న వార్త సంచలనం సృష్టించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు అయినప్పుడు, 24,000 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన కచ్చితంగా సెన్సేషనల్ న్యూసే అవుతుంది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్న “Rajesh Exports” ఒక మల్టీనేషనల్ […]
జూన్ 12, 2022 ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ రూ. 24,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే FAB Unit ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది అన్న వార్త సంచలనం సృష్టించింది.
మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు అయినప్పుడు, 24,000 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన కచ్చితంగా సెన్సేషనల్ న్యూసే అవుతుంది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్న “Rajesh Exports” ఒక మల్టీనేషనల్ గోల్డ్ రిటైల్ కంపెనీ. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటి. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ 2015 లో అక్షరాలా 3100 కోట్ల రూపాయిల క్యాష్ చెల్లించి స్విట్జర్లాండ్ లో ఉన్న ప్రపంచం లోనే పెద్దదైన గోల్డ్ రిఫైనర్ “Valcambi of Balerna” ను కొనుగోలు చేసింది.
తెలంగాణ కు ఇది ఎంతో ముఖ్యమైన పెట్టుబడి అని, దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి అని, తెలంగాణలో రాబోతున్న భారీ డిస్ప్లే ఫ్యాబ్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఏర్పడే వేలాది బ్లూ కాలర్ జాబ్స్ వల్ల మన తెలంగాణ యువతకు ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం మంత్రి కేటీఆర్ కు, ఆయన బృందానికి బాగా తెలుసు.
మంత్రి కేటీఆర్ తో సంబంధిత అధికారులు ఏ పెట్టుబడి విషయం ప్రస్తావించినా ఆయన అడిగే మొదటి ప్రశ్న ” ఈ పెట్టుబడి వల్ల ఎన్ని ఉద్యోగాలు సృష్టించ బడతాయి, ఎంతమంది తెలంగాణ యువతీ యువకులకు ఉపాధి లభిస్తుంది?” తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అనుక్షణం ఆలోచించే కేటీఆర్ తపన అలాంటిది.
ఇవన్నీ సీరియస్ విషయాలు… అసలు ఈ Rajesh exports వారి 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి వ్యవహారంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఇంకొకటుంది. అది… బెంగుళూరులో ఆదివారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, రాజేష్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ (ఎలెస్ట్) కంపెనీ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడానికి ముందు ఏం జరిగింది అన్న సంగతి.
నిజానికి ఈ పెట్టుబడి ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే వచ్చినప్పటికీ, ఒప్పంద పత్రాలపై మీద సంతకాలు పెట్టేంత వరకు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకుంటే… పెట్టుబడి పెడుతుంది బెంగుళూరు బేస్డ్ కంపెనీ… ఆ రాష్ట్రం లో అధికారం లో ఉంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ కు లాభం చేస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పని ఏదైనా సరే దానికి బీజేపీ పూర్తి వ్యతిరేకం.
మరోవైపు, 24,000 కోట్ల భారీ పెట్టుబడిని చేజిక్కించుకువాలని తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల పోటీని అధిగమిస్తూ, తెలంగాణ లో పెట్టుబడి పెట్టడానికి రాజేష్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ ని ఒప్పించారు. అయితే ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మంత్రి కేటీఆర్ కి, ఒకరిద్దరు ముఖ్య అధికారులకు తప్ప వేరేవరికీ దీనిపై ఎటువంటి సమాచారం లేదు.
ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసే డేట్ ఫిక్స్ అయ్యింది. కానీ, చివరి నిమిషంలో కూడా అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి విషయం బయటికి పొక్కకుండా అత్యంత జాగ్రత్త వహించారు. కేటీఆర్ టీిం సభ్యులైన కొంతమందికి సైతం ఆయన బెంగళూరు పర్యటన గురించి ఏ మాత్రం తెలియక పోవడాన్ని బట్టి, ఈ విషయాన్ని ఎంత రహస్యంగా ఉంచారు అన్న సంగతి, ఎంత సమర్థవంతంగా వ్యవహరించారు అన్న సంగతి అర్థం అవుతుంది.
All is well that ends well! మొత్తానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, కేటీఆర్ గారి సమక్షంలో సంతకాల కార్యక్రమం పూర్తయ్యి, తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోనే అత్యంత భారీ పెట్టుబడి ప్రకటన వెలువడింది.
అదీ కేటీఆర్ సీక్రెట్ మిషన్ సంగతి!