జగన్ ఒక్క ప్రకటన చేస్తే రాజకీయం మారిపోతుంది
ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్, విభజన హామీల సాధనలో ఏపీ సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వచ్చి హోదా సాధిస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదా, పోలవరం నిధుల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశం అన్నారు. విభజన హామీలను నెరవేర్చకపోతే మద్దతు ఇచ్చేది లేదని జగన్ ఒక్క ప్రకటన చేస్తే […]
ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్, విభజన హామీల సాధనలో ఏపీ సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వచ్చి హోదా సాధిస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదా, పోలవరం నిధుల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశం అన్నారు.
విభజన హామీలను నెరవేర్చకపోతే మద్దతు ఇచ్చేది లేదని జగన్ ఒక్క ప్రకటన చేస్తే మొత్తం రాజకీయం మారిపోతుందన్నారు. జగన్ ఎన్‌డీఏలో భాగస్వామి కాదని, అందుకే దళితులు, మైనార్టీలు ఓట్లేశారని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం లేకపోతే.. కనీసం ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. అప్పుడు ఎన్‌డీఏ అభ్యర్థి ఓడిపోతారన్నారు. ఎన్‌డీఏకి 13 వేల ఎలక్ట్రోరల్ ఓట్లు తక్కువగా ఉన్నాయని, వైసీపీ దగ్గర ఉన్న 43 వేల ఎలక్ట్రోరల్ ఓట్ల మద్దతు లభించకపోతే ఎన్‌డీఏ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమన్నారు. అలా కాకుండా తనపై కేసు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేను అని జగన్ అంటే ఇక రాష్ట్రానికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదన్నారు.
విభజనకు కాంగ్రెస్ మాత్రమే కారణమంటున్న ఈ పార్టీలు కూడా ఆ సమయంలో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినవేనని గుర్తు చేశారు. విభజన సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వం అనేక అంశాలను విభజన చట్టంలో చేర్చిందని.. వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ వల్ల కంటే బీజేపీ వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు.