విగ్గురాజు, పెగ్గురాజు, డూప్లికేట్ గాజు..
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రఘురామ వర్గం జోష్ లో ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అనర్హత పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఈ దశలో.. రఘురామపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హత వేటు పడలేదని సంతోషించొద్దని, […]
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రఘురామ వర్గం జోష్ లో ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అనర్హత పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఈ దశలో.. రఘురామపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హత వేటు పడలేదని సంతోషించొద్దని, ఆ పదవి కూడా ఆయన విగ్గులాగే తాత్కాలికం అనే విషయం గుర్తుంచుకోవాలని సెటైర్లు వేశారు.
రఘురామపై వరుసగా ఐదు ట్వీట్లు వేశారు విజయసాయిరెడ్డి. “ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.” అంటూ ట్వీట్ల వర్షం మొదలైంది.
“బూజు లాంటి రాజు..! ఓ పెగ్గు రాజు..నీ పదవీ నీ విగ్గులాంటిదే.. తీసేస్తే మిగిలేది గుండే!” అంటూ ఆయన ఎంపీ పదవిపై కూడా సెటైర్లు వేశారు. రెండోసారి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇతర పార్టీలు టికెట్ ఇచ్చినా నర్సాపురంలో ఆయన గెలిచేంత సీన్ లేదని పరోక్షంగా చెణుకులు విసిరారు.
నర్సాపురంలో లేకుండా కేవలం ఢిల్లీలోనే మకాం పెట్టిన రఘురామకృష్ణంరాజు.. అడగకుండానే అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే రాజు అంటూ విమర్శించారు విజయసాయి.
” అడగకుండానే నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు, పెగ్గురాజు! ”
” ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా? ”
” ఎల్లో కుల మీడియా రుచి కమ్మగా.. స్వంత పార్టీ రుచి చేదుగా.. నీదేం నోరురా విగ్గుబాబు!”
ఇలా వరుస ట్వీట్లతో విజయసాయి పొలిటికల్ హీట్ పెంచారు.