ప్రధాని పదవికోసం కాదు.. ప్రజల్లో చైతన్యం కోసం
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని, దీనికి కారణం పాలకులేనన్నారాయన. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తం అలాంటి అభివృద్ధికోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి […]
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని, దీనికి కారణం పాలకులేనన్నారాయన. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తం అలాంటి అభివృద్ధికోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం లేదని, దేశ ప్రజలను చైతన్య పర్చడానికేనని చెప్పారు.
ప్రత్యామ్నాయం కోసం ప్రజల చూపు..
అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోందని, మరోవైపు ఆ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కి నాయకుడే లేరని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తూన్నారని అన్నారు. తెలంగాణ పోరాట సమయంలో కేసీఆర్ ని చులకనగా మాట్లాడారని, భవిష్యత్తులో లో కేంద్ర రాజకీయాల్లో కూడా కేసీఆర్ విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.
కేంద్రంలో సరైన నాయకత్వం కావాలంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 70 ఏళ్లుగా దేశాన్ని పరిపాలించినా అభివృద్ధి శూన్యం అని చెప్పారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేసుకునే తెలంగాణ.. ఇప్పుడు దేశానికే బియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చి దిద్దారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని సైతం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే అందుకు సమర్థుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. తెలివితేటలు, నైపుణ్యంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు.