Telugu Global
NEWS

వైసీపీకి హ్యాండిచ్చిన లోక్‌సభ స్పీకర్ కార్యాలయం?!

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో కేంద్ర పెద్దలు వైసీపీకి ఏమాత్రం సహకరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో బిల్లులకు వైసీపీ ఎగబడి మద్దతు ఇస్తున్నా.. కనీసం వైసీపీ ఆత్మ గౌరవాన్ని కాపాడే అంశాలకూ అటు నుంచి మద్దతు రావడం లేదు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు సాధ్యం కాదని స్పీకర్‌ కార్యాలయ అధికారులు లీకులు వదిలారు. ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్టిలో ఈ అంశాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. సొంత పార్టీ ముఖ్యమంత్రి, సొంత పార్టీలోని ఇతర […]

YCP_losabha-Speaker-Office-Hand-RRR
X

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో కేంద్ర పెద్దలు వైసీపీకి ఏమాత్రం సహకరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో బిల్లులకు వైసీపీ ఎగబడి మద్దతు ఇస్తున్నా.. కనీసం వైసీపీ ఆత్మ గౌరవాన్ని కాపాడే అంశాలకూ అటు నుంచి మద్దతు రావడం లేదు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు సాధ్యం కాదని స్పీకర్‌ కార్యాలయ అధికారులు లీకులు వదిలారు.

ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్టిలో ఈ అంశాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. సొంత పార్టీ ముఖ్యమంత్రి, సొంత పార్టీలోని ఇతర నేతలపై విమర్శలు చేసినంత మాత్రాన ఒక ఎంపీపై అనర్హత వేటు వేయడం సాధ్యంకాదని స్పీకర్ కార్యాలయం అధికారులు తేల్చేశారు. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించిన సమయంలో మాత్రమే తప్పకుండా అనర్హత వేటు పడుతుందని.. వైసీపీ విప్‌ జారీ చేయడం, దాన్ని ఎంపీ ధిక్కరించడం ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు.

ఎంపీలపై పోలీసుల థర్డ్ డిగ్రీ అన్నది పార్లమెంట్ విధులతో ముడిపడిన అంశం కాదని కూడా లోక్‌సభ వర్గాలు తేల్చేశాయి. ఒక ఎంపీ పార్లమెంట్‌ విధులను నిర్వహించే సమయంలో అడ్డుపడితేనే అది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది కానీ.. బయట జరిగే గొడవలతో పార్లమెంట్‌కు సంబంధం ఉండదని వివరించారు. బయట ఎంపీలపై దాడి జరిగితే వారు కోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ఒక ఎంపీని అరెస్ట్‌ చేస్తే 24 గంటల్లోగా స్పీకర్‌ కార్యాలయానికి తెలియజేయాలని, అలా చేయకపోవడం వల్లనే బండి సంజయ్‌ విషయంలో జోక్యం చేసుకుని.. హోంశాఖ సెక్రటరీని పిలిపించి సభాహక్కుల కమిటీ విచారించిందన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ అంశాన్ని 24 గంటలలోపే స్పీకర్ కార్యాలయానికి తెలియజేశారని కాబట్టి ఆయన అంశాన్ని సభా హక్కుల కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు.

First Published:  11 Jun 2022 9:30 PM GMT
Next Story