Telugu Global
NEWS

ఈ చైర్మ‌న్ ప‌ద‌వి నాకు వెంట్రుక‌తో స‌మానం

ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ నేతలపైనా పోరాటానికి వెనుకాడడం లేదు. మాజీ మంత్రిపేర్ని నాని సిఫార్సు మేరకు విక్టర్ ప్రసాద్‌ను జగన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారని చెబుతుంటారు. దళితుల పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి కావడమూ ఆయనకు కలిసి వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నా పదవిలోకి వచ్చిన తర్వాత.. ఎస్సీలకు న్యాయం చేసే విషయంలో వైసీపీ పెద్దలనూ ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నారు. ఇది రాజ్యాంగ […]

victor-prasad-sensational-remarks
X

ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ నేతలపైనా పోరాటానికి వెనుకాడడం లేదు. మాజీ మంత్రిపేర్ని నాని సిఫార్సు మేరకు విక్టర్ ప్రసాద్‌ను జగన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారని చెబుతుంటారు. దళితుల పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి కావడమూ ఆయనకు కలిసి వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నా పదవిలోకి వచ్చిన తర్వాత.. ఎస్సీలకు న్యాయం చేసే విషయంలో వైసీపీ పెద్దలనూ ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నారు.

ఇది రాజ్యాంగ బద్దమైన పదవి కావడంతో ఇప్పుడు వైసీపీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. విక్టర్ ప్రసాద్‌ మీద వైసీపీ నేతలే కాకుండా, జిల్లాల ఉన్నతాధికారులు అనేక ఫిర్యాదులు మోసారు. ప్రోటోకాల్ పేరుతో తమపై అజమాయిషి చేస్తున్నారని, జనం ముందే నిలబెట్టి తమను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ పలు ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ ఒత్తిళ్ల నేపథ్యమో ఏమో గానీ.. విక్టర్ ప్రసాద్ తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడులో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం చేసేందుకు తాను ఎంత వరకైనా పోరాటం చేస్తానని.. ఈ పదవి తనకు వెంట్రుకతో సమానమన్నారు. తనను ఎక్కువగా కెలికితే మరో అమలాపురం సృష్టిస్తా అంటూ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దళితుల పక్షాన తాను చేస్తున్నపోరాటానికి ఎంపీలు, ఎమ్మెల్యేలే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఎస్సీ కార్పొరేషన్ పదవి నుంచి తనను తప్పించాలని చూస్తున్నారని, తనకు ఈ పదవి వెంట్రుకతో సమానమంటూ సంచలన వ్యాఖ్య చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  11 Jun 2022 10:07 PM GMT
Next Story