Telugu Global
NEWS

పచ్చ చానళ్లలో తప్పుడు ప్రచారం.. మంత్రి రోజా క్లారిటీ..!

పర్యాటకశాఖ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా రోజాతోపాటు ఆమె గన్ మన్ కూడా మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లారని కొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మహాద్వారం గుండా నా గన్ మన్ వెళ్లాడని ఓ టీవీలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇటీవల నేను నియోజకవర్గంలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం […]

minister-roja-fires-yellow-media
X

పర్యాటకశాఖ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా రోజాతోపాటు ఆమె గన్ మన్ కూడా మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లారని కొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మహాద్వారం గుండా నా గన్ మన్ వెళ్లాడని ఓ టీవీలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు.

ఇటీవల నేను నియోజకవర్గంలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం చేసినప్పుడు నా మీటింగ్ కు జనం ఎవరూ రాలేదని.. పాత వీడియోతో తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని జనం ఎవరూ నమ్మరు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ లేదు. దీంతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ కుట్రలు చేస్తోంది. కానీ ప్రజలు ఈ కుట్రలను నమ్మరు.

ఇక రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తానంటూ పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయన ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో.. ప్రజలకు చెప్పాలి. చంద్రబాబుకు కష్టం వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తుంటారు? ఆయన కోసమే జనసేన పెట్టుకున్నారు. ఆయన బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో? ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబును, లోకేశ్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ లేదు..బొక్కా లేదు.. అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారంటే టీడీపీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ’ అని రోజా మండిపడ్డారు.

First Published:  11 Jun 2022 9:44 AM IST
Next Story