మంత్రులతో కేసీఆర్ కీలక భేటీ – రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ లో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై వారితో చర్చించనున్నారు. వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపైనా ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా కేంద్ర బీజేపీ సర్కార్ పై యుద్దం ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిదాయకంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ లో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై వారితో చర్చించనున్నారు. వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపైనా ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
కొంత కాలంగా కేంద్ర బీజేపీ సర్కార్ పై యుద్దం ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిదాయకంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తున్న కేసీఆర్ ఎన్డీఏ తరపున నిలబడబోయే రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించేందుకు ఏం చేస్తారన్నది అన్ని రాజకీయ పక్షాలు గమనిస్తున్నాయి.
ఇప్పటికే దేశంలో బీజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను ఏకం చేయడానికి దేశవ్యాప్త పర్యటన చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం జరగవచ్చు. ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేక మిగతా రాజకీయ పక్షాలతో కలిసి ఓ అభ్యర్థిని నిర్ణయించి కాంగ్రెస్ మద్దతును కోరుతారా అనేది ఇవ్వాళ్ళ జరిగే సమావేశంలో నిర్ణయం జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ నుంచి మొత్తం పోలయ్యే ఓట్ల విలువ 32,508 ఉండగా అందులో టీఆర్ఎస్‌దే 76 శాతం ఉంది. ఈ ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి పడతాయన్నది హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు ఉండాలన్న దానిపై ఇవాళ మంత్రులకు సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశముంది.