రాజమండ్రిలో హాట్ కామెంట్స్.. జయప్రద ఏపీకి ఫిక్స్ అయినట్టేనా?
రాజమండ్రి నా జన్మభూమి, ఉత్తర ప్రదేశ్ నా కర్మ భూమి అంటూ బీజేపీ సభలో వ్యాఖ్యానించారు జయప్రద. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ పెడతానంటూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన జయప్రద.. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలసి బీజేపీ గోదావరి గర్జన సభకు హాజరయ్యారు. చాన్నాళ్లుగా ఆమె బీజేపీలోనే ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సభలు, సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదు. ఇప్పుడు గోదావరి గర్జనతో తాను బీజేపీలోనే ఉన్నట్టు క్లారిటీ […]
రాజమండ్రి నా జన్మభూమి, ఉత్తర ప్రదేశ్ నా కర్మ భూమి అంటూ బీజేపీ సభలో వ్యాఖ్యానించారు జయప్రద. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ పెడతానంటూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన జయప్రద.. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలసి బీజేపీ గోదావరి గర్జన
సభకు హాజరయ్యారు. చాన్నాళ్లుగా ఆమె బీజేపీలోనే ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సభలు, సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదు. ఇప్పుడు గోదావరి గర్జనతో తాను బీజేపీలోనే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారామె. రాజమండ్రి తన జన్మభూమి అని చెప్పి.. ఏపీ రాజకీయాలపై తన ఆశక్తిని చెప్పకనే చెప్పారు.
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు..
ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వం, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సందర్భాలు అరుదు. కానీ మోదీ ఏపీ పర్యటనకు ముందు సడన్ గా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఆశిస్తూనే, మరోవైపు ఏపీకి వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. జయప్రద కూడా ఏపీని అప్పుల ప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ఏపీపై 7లక్షల కోట్ల రూపాయల రుణ భారం ఉందని అన్నారామె. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారని చెప్పారు జయప్రద. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయి కానీ, ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు అప్పు చేశారు కానీ, పేదలకు ఒరిగిందేమీ లేదన్నారామె. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని కూడా విమర్శించారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు.
బీజేపీ పటిష్టతకు పాటుపడతా..
కొన్ని కారణాల వల్ల ఏపీని వదిలి ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పుడు ఏపీలో బీజేపీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు జయప్రద. మొత్తమ్మీద రాజమండ్రి సభతో జయప్రద రెండు విషయాలు స్పష్టం చేశారు. తానింకా బీజేపీలో ఉన్నానని, తాను ఏపీ రాజకీయాల్లో బిజీ అవుతానని పరోక్షంగా హింటిచ్చారు.