తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో తాము విధించిన జరిమానాను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు 100 శాతం ఎస్టీలకే చెందేలా ఒక జీవోను తీసుకొని వచ్చింది. సదరు జీవోను సవాల్ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదనలు విన్న తర్వాత ఆ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పింది. ఉమ్మడి […]
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో తాము విధించిన జరిమానాను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు 100 శాతం ఎస్టీలకే చెందేలా ఒక జీవోను తీసుకొని వచ్చింది. సదరు జీవోను సవాల్ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదనలు విన్న తర్వాత ఆ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పింది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధంచడమే కాకుండా.. రాజ్యాంగానికి విరుద్దంగా ఉండటంతో సుప్రీంకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. కాగా, ఇంతలోనే రాష్ట్ర పునర్విభజన జరగడంతో ఆస్తులు, అప్పులతో పాటు ఇలాంటి కోర్టు కేసుల్లో జరిమానాలు కూడా రాష్ట్రాలకు సమానంగా పంచారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రూ. 2.50 లక్షల జరిమానా చెల్లించి.. సుప్రీం ఆదేశాల మేరకు సదరు జీవోను నిలిపేస్తున్నట్లు మరో జీవో జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా సదరు జీవో అమలును నిలిపేసింది. కానీ సుప్రీంకోర్టుకు జరిమానా మాత్రం చెల్లించలేదు. ఈ విషయంలోనే అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వ అలసత్వమేనని చెప్పింది. రెండు వారాల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒక వేళ చెల్లించకపోతే కోర్టు ధిక్కారణ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొంది.
కాగా, సదరు జీవోపై రివ్యూ పిటిషన్ కోర్టులో ఉందని, అందుకే జరిమానా చెల్లించలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. అయినా సరే ఫైన్ చెల్లించిన తర్వాతే మిగతా విషయాలు చర్చించుదామని సుప్రీంకోర్టు తెలిపింది.