ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ !
ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డితో పాటు ఎనిమిది మంది నామినేషన్ వేశారు. బై పోల్‌కు దూరం అని టీడీపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో లక్ష ఓట్ల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో వ్యూహా రచన చేస్తోంది. ఆత్మకూరులో మొత్తం 2 లక్షల 33 వేల 330 మంది ఓటర్లు. […]
ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డితో పాటు ఎనిమిది మంది నామినేషన్ వేశారు. బై పోల్‌కు దూరం అని టీడీపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో లక్ష ఓట్ల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో వ్యూహా రచన చేస్తోంది.
ఆత్మకూరులో మొత్తం 2 లక్షల 33 వేల 330 మంది ఓటర్లు. గత రెండు ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి 20 వేలకుపైగానే మెజార్టీ సాధించారు. 2014లో 31వేల 686 మెజార్టీ సాధిస్తే.. 2019లో 22వేల 276 మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఈ సారి బై పోల్‌లో లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని వైసీపీ నేతలు ప్లాన్‌లు వేస్తున్నారు.
ఆత్మకూరు మున్సిపాల్టీతో పాటు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలను ఇంచార్జ్‌లుగా నియమిస్తోంది. మండలానికో ఇంచార్జ్‌ను వైసీసీ నియమిస్తోంది, మంత్రులు కె.నారాయణ స్వామి, రోజా, మేరుగు నాగార్జున, అంజాద్ బాషాతో పాటు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లు ఇంచార్జ్‌లుగా ఉంటారు.
మొత్తానికి ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజార్టీ సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనేది వైసీపీ ప్రయత్నంగా తెలుస్తోంది.