Telugu Global
NEWS

8 పరుగులకే నేపాల్ ఆలౌట్

మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ భూఖండంలోని 204 దేశాలకు పురుషుల, మహిళల విభాగాలలో క్రికెట్ ను అంటించడానికి కంకణం కట్టుకొంది. అయితే..మహిళా క్రికెట్లో సీనియర్ విభాగంతో పాటు అండర్ -19 విభాగంలోనూ ఐసీసీ ఖండాలవారీగా అంతర్జాతీయ టీ-20 టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 సీజన్ అండర్ -19 క్వాలిఫైయింగ్ టోర్నీలో నేపాల్, భూటాన్ […]

8 పరుగులకే నేపాల్ ఆలౌట్
X

మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ భూఖండంలోని 204 దేశాలకు పురుషుల, మహిళల విభాగాలలో క్రికెట్ ను అంటించడానికి కంకణం కట్టుకొంది. అయితే..మహిళా క్రికెట్లో సీనియర్ విభాగంతో పాటు అండర్ -19 విభాగంలోనూ ఐసీసీ ఖండాలవారీగా అంతర్జాతీయ టీ-20 టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 సీజన్ అండర్ -19 క్వాలిఫైయింగ్ టోర్నీలో నేపాల్, భూటాన్ , మలేసియా, థాయ్ లాండ్, యూఏఈ, ఖతర్ లాంటి పసికూనజట్లు పోటీపడుతున్నాయి. యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ తొలిమ్యాచ్ లోనే ఓ చిత్రమైన రికార్డు నమోదయ్యింది.

8.1 ఓవర్లలో 8 పరుగులు..

యూఏఈ- నేపాల్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ అర్హత ప్రారంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన నేపాల్ జట్టు.. ఇన్నింగ్స్ లోని మొత్తం 20 ఓవర్లూ బ్యాట్ చేయలేకపోయింది. 8.1 ఓవర్లలో కేవలం 8 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే డకౌట్లు కావడం మరో రికార్డు.

యూఏఈ మీడియం పేసర్ మహికా గౌర్ 2 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. సమాధానంగా 20 ఓవర్లలో 9 పరుగులు విజయలక్ష్యంగా చేజింగ్ కు దిగిన యూఏఈ ఓపెనర్లు లావణ్యా కెన్నీ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు, తీర్థా సతీష్ 4 బాల్స్ ఎదుర్కొని 4 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడం ద్వారా తమజట్టుకు 10 వికెట్ల విజయం అందించారు.

దక్షిణాఫ్రికా వేదికగా 2023లో జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ కోసం అర్హతగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో నేపాల్ సాధించిన 8 పరుగుల ఆలౌట్ ఓ చెత్తరికార్డుగా మిగిలిపోనుంది.

First Published:  5 Jun 2022 3:08 AM IST
Next Story