Telugu Global
NEWS

సినిమా టికెట్లపై కమిషన్ పరిశ్రమ అభివృద్ధికే.. ప్రభుత్వానికి వద్దు..

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం 2 శాతం కమిషన్ వసూలు చేయడానికి సిద్ధమైందని, ఇది మరో వడ్డింపు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. సినిమా టికెట్లపై భవిష్యత్తులో వసూలు చేయబోయే 1.95 శాతం కమిషన్ లో 0.95 శాతం సర్వీస్ ప్రొవైడర్ కు, మిగిలిన 1 శాతం సినీ పరిశ్రమ అభివృద్ధికి అంటూ స్పష్టం చేసింది. కొత్త జీవోలో ఏముంది..? ఆన్ లైన్ లో సినిమా టికెట్లను అధికారికంగా విక్రయించేందుకు […]

సినిమా టికెట్లపై కమిషన్ పరిశ్రమ అభివృద్ధికే.. ప్రభుత్వానికి వద్దు..
X

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం 2 శాతం కమిషన్ వసూలు చేయడానికి సిద్ధమైందని, ఇది మరో వడ్డింపు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. సినిమా టికెట్లపై భవిష్యత్తులో వసూలు చేయబోయే 1.95 శాతం కమిషన్ లో 0.95 శాతం సర్వీస్ ప్రొవైడర్ కు, మిగిలిన 1 శాతం సినీ పరిశ్రమ అభివృద్ధికి అంటూ స్పష్టం చేసింది.

కొత్త జీవోలో ఏముంది..?
ఆన్ లైన్ లో సినిమా టికెట్లను అధికారికంగా విక్రయించేందుకు ఏపీ ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (FDC) రంగం సిద్ధం చేసింది. ఈమేరకు హోం శాఖ జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్న 1,140 సినిమా థియేటర్ల యాజమాన్యాలు FDC తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. థియేటర్లు, FDC మధ్య ఒప్పందం ఖరారైన తర్వాత ఇకపై సినిమా టికెట్లన్నీ ఆన్ లైన్ లోనే విక్రయించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించబోతున్నారు. అయితే థియేటర్ల వద్ద కూడా టికెట్ కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్లలో కూడా ప్రభుత్వ వెబ్ సైట్ నుంచే టికెట్లు బుక్ చేసి, థియేటర్ సిబ్బంది ప్రేక్షకులకు విక్రయించాల్సి ఉంటుంది.

కమిషన్ సంగతేంటి..?
ఏపీలోని సినిమా థియేటర్లలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని భర్తీ అయ్యాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది అంతా ఆన్ లైన్ లో ఉంటుంది. దాని ప్రకారం సినిమా కలెక్షన్ల లెక్క తేలిపోతుంది. దీనికోసం జస్ట్ టికెట్స్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించే సంస్థలు 12 నుంచి 15 శాతం కమిషన్ తీసుకుంటున్నాయి. ఇకమీదట ప్రభుత్వ వెబ్ సైట్ లో కేవలం 1.95 శాతం కమిషన్ తో టికెట్లు విక్రయిస్తారు. ఆ కమిషన్ మొత్తం సర్వీస్ ప్రొవైడర్ కు, సినీ పరిశ్రమకు మాత్రమే వెళ్తుంది.

బ్లాక్ మార్కెట్ ని అడ్డుకోగలరా..?
ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా టికెట్లు విక్రయిస్తే బ్లాక్ మార్కెట్ కి అడ్డుకట్ట పడే అవకాశముంది. అయితే అదే సమయంలో ప్రైవేటు టికెట్ బుకింగ్ ఏజెన్సీలు కూడా ప్రభుత్వ వెబ్ సైట్లో టికెట్లు కొని, వాటిని మారు బేరానికి అమ్ముకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం విశేషం. దీంతో ప్రైవేటుగా ఆన్ లైన్లో టికెట్లు అమ్ముకునే వెబ్ సైట్స్ ద్వారా ప్రేక్షకులపై భారం పడే అవకాశముంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

First Published:  5 Jun 2022 2:22 AM IST
Next Story