ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు
అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. దీని వెనక టీడీపీ నేతలు, వారి అనుచరులు, ఐటీడీపీ యాక్టివిస్ట్ లు ఉన్నట్టు నిర్థారించారు పోలీసులు. దీంతో వారందరికీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురిని సీఐడీ పోలీసులు విచారణకోసం గుంటూరు కార్యాలయానికి పిలిపించడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. సీఐడీ విచారణ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. […]
అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. దీని వెనక టీడీపీ నేతలు, వారి అనుచరులు, ఐటీడీపీ యాక్టివిస్ట్ లు ఉన్నట్టు నిర్థారించారు పోలీసులు. దీంతో వారందరికీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురిని సీఐడీ పోలీసులు విచారణకోసం గుంటూరు కార్యాలయానికి పిలిపించడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. సీఐడీ విచారణ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ అధికార పక్షం మండిపడుతోంది.
ఈ వ్యవహారంలో తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కు సీఐడీ నోటీసులు జారీచేసింది. అమ్మఒడి, వాహనమిత్ర పధకాలు రద్దు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనక గౌతు శిరీష హస్తం కూడా ఉందని నిర్థారించుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు జారీచేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని గౌతు శివాజీ నివాసానికి నిన్న రాత్రి వెళ్లిన సీఐడీ అధికారులు శిరీషకు నోటీసులు అందజేశారు. ఈ నెల 6న మంగళగిరి లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసిలోని సెక్షన్ 41 క్రింద నోటీసులు జారీ చేశారు.
ఇటీవలే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు వెంకటేష్ ని సీఐడీ పోలీసులు విచారణ కోసం పిలిపించారు. ఈ ఫేక్ పోస్ట్ ల వ్యవహారం ఇప్పుడు పూర్తిగా టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. కీలక నేతలు, వారి అనుచరులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. ఎన్నికలకు రెండేళ్ల సమయమే ఉండటంతో..
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తున్నారంటూ ఓవైపు విమర్శిస్తూ, మరోవైపు పథకాలు ఆగిపోతున్నాయంటూ ఫేక్ ప్రచారానికి దిగుతున్నారు.