Telugu Global
NEWS

చైర్మన్ ఆదేశించారు.. 24గంటల్లో భక్తుల కష్టాలు తీరాయి

తిరుమల నడకదారి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరుకుంటారు. రెండుచోట్లా మెట్లపై రేకులతో షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. ఎండ, వాన నుంచి వారికి రక్షణ ఉంటుంది. అయితే అలిపిరి మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు రోడ్డుపై నడవాల్సి ఉంటుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దారిపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కుతాయి. కాలినడకన వచ్చే భక్తులు చెప్పులు వేసుకోరు కాబట్టి.. ఆ కాస్త దూరం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. […]

ttd-chairman-yv-subbareddy-resolves-issue-of-devotees-in-24-hours
X

తిరుమల నడకదారి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరుకుంటారు. రెండుచోట్లా మెట్లపై రేకులతో షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. ఎండ, వాన నుంచి వారికి రక్షణ ఉంటుంది. అయితే అలిపిరి మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు రోడ్డుపై నడవాల్సి ఉంటుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దారిపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కుతాయి. కాలినడకన వచ్చే భక్తులు చెప్పులు వేసుకోరు కాబట్టి..

ఆ కాస్త దూరం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో వారికి తెలయదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నడకదారి భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టారు. మోకాలి మెట్టు దగ్గర నుంచి భక్తులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా గమనించారు. వెంటనే భక్తుల కష్టాలు తొలగించేలా అక్కడ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని నీళ్లు చల్లడం ద్వారా ఆ దారి చల్లగా ఉండేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.

24 గంటల్లో పని పూర్తి..

సహజంగా ఇలాంటి పరిశీలనలు, ఆదేశాలు అన్ని విభాగాల్లో ఉంటాయి. చైర్మన్ ఆదేశించినా పనులు వెంటనే మొదలవుతాయనే నమ్మకం లేదు. అయితే ఆయన స్వయంగా భక్తుల కష్టాలపై దృష్టి పెట్టి డెడ్ లైన్ విధించారు.

24గంటల్లో నడకదారి భక్తుల కష్టాలు తీర్చాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు హడావిడి పడ్డారు. మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేయించి నీళ్లు చల్లించే ఏర్పాట్లు కూడా చేశారు. చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పని పూర్తయింది.

చైర్మన్ కు అభినందనలు..

24గంటల్లో భక్తుల కష్టాలు తీర్చిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ సిబ్బంది సత్వర స్పందనను భక్తులు అభినందించారు. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

నడక మార్గంలో అదనపు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుమల కొండపై కూడా భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

First Published:  4 Jun 2022 2:26 PM IST
Next Story