Telugu Global
WOMEN

ఇంట్లో ఉండే ఆడవాళ్లకు బెస్ట్ డైట్ ఇదే!

మనదేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఒబెసిటీ సమస్య పెరుగుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఒబెసిటీతో పాటు పోషకాహార లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారట.

ఇంట్లో ఉండే ఆడవాళ్లకు బెస్ట్ డైట్ ఇదే!
X

మనదేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఒబెసిటీ సమస్య పెరుగుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఒబెసిటీతో పాటు పోషకాహార లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారట. అందుకే హౌజ్‌వైవ్స్ కోసం భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైట్ చార్ట్‌ను రూపొందించింది.

ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత, గర్భ ధారణ సమస్యలు, మెనోపాజ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాళ్లు డైట్‌తో సమస్యలను అధిగమించవచ్చు. అదెలాగంటే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రూపొందించిన డైట్ చార్ట్‌ ప్రకారం శారీరక శ్రమ లేని ఆడవాళ్లు మితమైన ఆహారాన్ని తీసుకుంటూ డైట్ పట్ల జాగ్రత్త వహించాలి.

తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉండాలి. నూనెలో వేగించిన ఆహారాలకు బదులు ఆవిరిపై ఉడికించిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇంట్లో ఉండే ఆడవాళ్లు మాసం, చేపలు అప్పడప్పుడూ తినాలి. కూల్‌ డ్రింక్స్‌ జోలికి వెళ్లకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. గ్రీన్ టీ, హెర్బల్‌ టీలు వంటివి తీసుకోవచ్చు. షుగర్ పదార్థాలు బాగా తగ్గించాలి.

స్నాక్స్‌ టైంలో జంక్ ఫుడ్ కాకుండా పండ్ల వంటివి తీసుకోవాలి. మీల్‌లో మిల్లెట్స్ వంటి వాటిని చేర్చుకోవాలి. పప్పు ధాన్యాల ద్వారా ప్రొటీన్లు కూడా తగిన మొత్తంలో తీసుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌గా కాయగూరలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. క్యాల్షియం, విటమిన్–డి కోసం పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి.

ఇంట్లో ఉండే ఆడవాళ్లు కుదిరితే తేలికపాటి వ్యాయామం చేయాలి. ఒకవేళ కుదరకపోతే డైట్ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. తగినంత నిద్ర పోతూ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

First Published:  16 Jun 2024 9:30 AM GMT
Next Story