Telugu Global
WOMEN

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం

మంత్రి సీతక్క హామీ.. ఆందోళన విరమించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం
X

అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు కొన్ని రోజులుగా ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్నారు. గురువారం సెక్రటేరియట్‌కు వారంతా వచ్చి మంత్రి సీతక్కను కలిశారు. వేతనాలు రూ.18 వేలకు పెంచాలని, అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని, గత ప్రభుత్వంలో చేసిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో చర్చించి ఆ సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వాళ్లు ఆందోళన విరమించారు.

మహిళా సమాఖ్య సభ్యులకు చీరలు

మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాంలుగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకు ప్రత్యేక డిజైన్లలో చీరలు తయారు చేయించింది. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరలను గురువారం మంత్రి సీతక్క చీరల డిజైన్లు పరిశీలించారు. కార్యక్రమంలో సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

First Published:  12 Dec 2024 6:31 PM IST
Next Story