Telugu Global
WOMEN

న్యూ ఇయర్ పార్టీకి ఇలా హోమ్ ఫేషియల్ చేసుకొని రెడీ అయిపొండి..

చలికాలంలో ఒకే ఒక్క టమాటాతో ఈ 10 నిమిషాల ఫేషియల్‌ చేసుకుంటే పార్లర్ కంటే మెరుగైన ప్రయోజనాలను పొందచ్చు.

న్యూ ఇయర్ పార్టీకి ఇలా హోమ్ ఫేషియల్ చేసుకొని రెడీ అయిపొండి..
X

సరదా సరదాగా క్రిస్మస్ అయిపోయింది. న్యూ ఇయర్ వైపుగా రోజులు పరుగులు పెడుతున్నాయి. వరుస పార్టీలకి రెడీ అవ్వాల్సిన రోజులివి . ఇక ఉన్న నాలుగు రోజుల్లో చక్కని నిగారింపయిన చర్మం కోసం ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

చలికాలం వస్తే చర్మం పొడి బారి, నిర్జీవంగా తయారవుతుంది. ఈ కాలంలో గాలిలో తేమ ఉండదు. పొడి వాతావరణం చర్మానికి మరింత ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అలా అని ముఖానికి క్రీమ్‌ రాసుకున్న తర్వాత రాత్రి నిద్రపోయే ముందు ముఖం సరిగ్గా కడుక్కోకపోతే చర్మం మరింత ముడతలు పడిపోతుంది. కాబట్టి చలికాలంలో చర్మాన్ని కొంచెం ఎక్కువ శ్రద్ధతో చూసుకోవడం అవసరం. చలికాలంలో ఒకే ఒక్క టమాటాతో ఈ 10 నిమిషాల ఫేషియల్‌ చేసుకుంటే పార్లర్ కంటే మెరుగైన ప్రయోజనాలను పొందచ్చు .

బాగా పండిన టమోటా ఒకటి సగానికి కట్ చేసి, దానిపై ఒక చెంచా చక్కెర, 7-8 చుక్కల కొబ్బరి నూనె జోడించాలి. దీంతో చర్మాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మంలోని మురికి, ధూళిని మొత్తం తొలగిస్తుంది. టొమాటోతో ముఖంపై 1 నిమిషం పాటు రుద్దిన తర్వాత, చేతులతో మసాజ్ చేసుకోవాలి.


సుమారు 5 నిమిషాల మసాజ్ తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. టమోటాలో మిగిలిన సగంతో రసం తీసి. ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా రసం తీసుకుని, దానిలో 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి కలుపుకోవాలి. అందులో 1 చెంచా నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి అప్లై చేసుకోవాలి.

ఈ ప్యాక్‌ని ముఖం, చేతులు, పాదాలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చేతులతో తేలికగా రుద్దుకోవాలి. చలికాలంలో స్నానానికి ముందు ఈ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత, చర్మానికి సబ్బును ఉపయోగించకూడదు.

First Published:  27 Dec 2023 8:15 AM IST
Next Story