మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

మానవ అక్రమ రవాణాను అరికట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పై సెర్ప్ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్న రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్‌ను దివ్య ప్రజల సంస్థ ఫౌండర్ సునీత కృష్ణన్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మధ్య తరగతి, పేద మహిళలు, యువతులు ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పై పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోన్న ఇంకో జటిలమైన సమస్య అని.. స్మార్ట్ ఫోన్‌ల వినియోగంతో కలిగే నష్టాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. పేద, మధ్య తరగతి యువతులను ట్రాఫికర్స్ టార్గెట్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాం.. సినిమాల్లో చాన్స్‌లు ఇప్పిస్తామని పట్టణాలను తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 వేల మంది యువతులు, మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరి నుంచి కాపాడామన్నారు. వీరిలో చిన్నపిల్లలు, యువతులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. స్మార్ట్ ఫోన్స్‌లోని యాప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్, వీడియోస్ పంపి యువతులు సెక్స్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారని.. దీనిపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు సునీత, సరిత, అరుంధతి, సురేఖ రెడ్డి, అహ్మద్ అలీ, బలరామకృష్ణ, సురేశ్ కుమార్, అంబర్ సింగ్, మితాలీ రాజ్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.