ఉమెన్ టీచర్స్ డేగా సావిత్రి భాయి ఫూలే జయంతి
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
BY Naveen Kamera2 Jan 2025 7:36 PM IST
X
Naveen Kamera Updated On: 2 Jan 2025 7:36 PM IST
సవిత్రి భాయి ఫూలే జయంతిని ఉమెన్ టీచర్స్ డేగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 3వ తేదీ (శుక్రవారం) ఉమెన్ టీచర్స్ డే ను స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు శుక్రవారం సావిత్రి భాయి ఫూలే జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే తన సతీమణి సావిత్రి భాయి ఫూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించారు. సావిత్రి భాయి ఫూలేను ఫస్ట్ ఉమెన్ టీచర్ అని చెప్తారు. ఈక్రమంలోనే విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన మహిళా టీచర్లను ఘనంగా సత్కరించనున్నారు.
Next Story