Telugu Global
WOMEN

చిటికెలో మేకప్ వేసుకునే టెక్నిక్స్‌!

తక్కువ టైంలో మేకప్ వేసుకోవడం కోసం ఫౌండేషన్, హైలైటర్‌‌తో పాటు కొన్ని భాగాలకు సింపుల్ టచప్ చేయడమెలాగో తెలుసుకోవాలి.

చిటికెలో మేకప్ వేసుకునే టెక్నిక్స్‌!
X

మేకప్‌ వేసుకోవడం కోసం చాలా టైం స్పెండ్ చేస్తుంటారు చాలామంది. అయితే దీనివల్ల కొన్నిసార్లు టైం సరిపోక ఇబ్బంది పడొచ్చు. అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లాల్సివచ్చినప్పుడు మేకప్ కోసం టైం సరిపోకపోవచ్చు. కాబట్టి తక్కువ టైంలో నీట్‌గా మేకప్ వేసుకునే టిప్స్ తెలుసుకోవాలి.

తక్కువ టైంలో మేకప్ వేసుకోవడం కోసం ఫౌండేషన్, హైలైటర్‌‌తో పాటు కొన్ని భాగాలకు సింపుల్ టచప్ చేయడమెలాగో తెలుసుకోవాలి.

ఫౌండేషన్‌: మేకప్‌లో ఫౌండేషన్‌ ముఖ్యమైంది. అయితే ఫౌండేషన్‌ అద్దుకోడానికి చాలా టైం పడుతుంది. అందుకే అందులో కొద్దిగా ఎస్సెన్షియల్ ఆయిల్‌ను కలిపితే ముఖానికి అప్లై చేయడం ఈజీ అవుతుంది. ఫౌండేషన్ త్వరగా అయిపోతుంది.

హైలైటర్‌: కళ్ల అందం కోసం కంటూరింగ్‌ చేస్తుంటారు చాలామంది. అయితే క్రీమ్‌ హైలైటర్‌ వాడడం ద్వారా కంటూరింగ్ త్వరగా అయిపోతుంది. కన్సీలర్‌ను కళ్ల కింద అప్లై చేసేముందు, క్రీమీ హైలైటర్‌తో కాంటూర్‌ చేసుకుంటే కళ్లు అందంగా కనిపిస్తాయి.

కనుబొమలు: బ్రోజెల్‌తో కనుబొమలను చిక్కగా అలంకరించొచ్చు. గ్లిజరిన్‌ సోప్‌ మీద బ్రో బ్రష్‌ను అద్ది దాంతో కనుబొమలను తీర్చిదిద్దినా సరిపోతుంది. ఆ తర్వాత బ్రష్‌ చేసుకుంటే కనుబొమలు అందంగా కనిపిస్తాయి.

కనురెప్పలు: కనురెప్పల మొదళ్లలో కర్లర్‌ను ఉంచి, నాలుగైదు సార్లు పైకి తిప్పుకుని, సాధ్యమైనంత తక్కువ మస్కారాను ఉపయోగిస్తే, కనురెప్పలు చిక్కగా వంపుతిరిగి కనిపిస్తాయి. చిటికెలో పని పూర్తవుతుంది.

First Published:  8 Jan 2023 1:30 PM IST
Next Story