పర్మినెంట్ మేకప్ గురించి తెలుసా?
సాధారణంగా మేకప్‌లో పెదవులకు లిప్‌స్టిక్, కనుబొమలకు ఐబ్రోస్ త్రెడింగ్, మచ్చలు కవర్ చేసేలా ఫౌండేషన్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే వీటిలో దేన్నైనా పర్మినెంట్‌గా మార్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా స్పెషల్ మేకప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్నే పర్మినెంట్ మేకప్ ట్రీట్మెంట్ అంటారు.
మేకప్ అనేది టెంపరరీ అందం కోసం వేసుకుంటుంటారు. బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకుని తర్వాత తీసేస్తుంటారు. అలాకాకుండా పర్మినెంట్‌గా వేసుకునే మేకప్ పద్ధతి ఒకటుంది. అదే పర్మినెంట్ మేకప్. ఇదెలా ఉంటుందంటే.
సాధారణంగా మేకప్‌లో పెదవులకు లిప్‌స్టిక్, కనుబొమలకు ఐబ్రోస్ త్రెడింగ్, మచ్చలు కవర్ చేసేలా ఫౌండేషన్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే వీటిలో దేన్నైనా పర్మినెంట్‌గా మార్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా స్పెషల్ మేకప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్నే పర్మినెంట్ మేకప్ ట్రీట్మెంట్ అంటారు.
పర్మినెంట్ మేకప్ ఎంచుకుంటే ఇక మాటిమాటికి వాటిని సరిచేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు కనుబొమలు పలుచగా ఉంటే.. వాటికి ప్రతిసారి మేకప్ వేసే బదులు పర్మినెంట్‌గా ఐబ్రో షేపింగ్ చేపించొచ్చు. కొన్ని కృత్రిమ రంగుల సాయంతో మైక్రో పిగ్మెంటేషన్ చేసి పర్మినెంట్‌గా కనుబొమలు కనిపించేలా స్ట్రోక్స్ ఇస్తారు.
పెదవులకు ఇలా..
పెదవుల రంగుని పూర్తిగా మార్చడం కోసం నచ్చిన రంగుని ఎంచుకుని పర్మనెంట్ లిప్‌స్టిక్ చేయించుకోవచ్చు. టాటూ తరహా ఇంకుని వాడి పెదవులకు పర్మినెంట్‌గా ఉండిపోయేలా రంగు వేస్తారు.
కనురెప్పల కోసం..
పర్మినెంట్ మేకప్‌లో భాగంగా ఐలైనర్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఐ లైన్ పొడవు, వెడల్పులను నిర్ణుయించుకుని పర్మినెంట్‌గా ఉండిపోయేలా ఐలైనర్ వేస్తారు.
మచ్చలు పోయేలా
ముఖంపై మచ్చలు కనిపించకుండా చర్మంలో కలిసిపోయేలా ఓ ప్రత్యేకమైన చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో క్రీమ్‌ను డెర్మా పెన్ ద్వారా చర్మం పై పొరల్లోకి ఇంకేలా చేస్తారు. తద్వారా కొన్ని నెలల పాటు మచ్చలు కనిపించకుండా ఉంటాయి.
జాగ్రత్తలు ముఖ్యం
ఈ తరహా మేక్‌ప్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిపుణులైన డెర్మటాలజిస్ట్‌తోనే ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. ఒకవేళ మీ స్కిన్ టైప్ మేకప్ ట్రీట్మెంట్స్‌కు సరిపోదని వాళ్లు సూచిస్తే దానికి దూరంగా ఉండడమే మంచిది.