చైనీస్ ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే..
చైనీయుల చర్మ సౌందర్యం వెనుక ఉన్న టాప్ సీక్రెట్.. స్కిన్ రెజువనేషన్. దీనికోసం చైనీస్ స్కిన్ ఎక్స్‌ఫాలియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు.
బ్యూటీ ట్రెండ్స్‌లో చైనీయుల స్టైలే వేరు. మలి వయసులో కూడా మృదువైన ముడతలు లేని చర్మం వాళ్ల ప్రత్యేకత. ఇలాంటి చర్మం కోసం వాళ్లు ట్రెడిషనల్ బ్యూటీ రొటీన్‌ను ఫాలో అవుతారు. అదేంటో తెలుసుందామా..
చైనీయుల చర్మ సౌందర్యం వెనుక ఉన్న టాప్ సీక్రెట్.. స్కిన్ రెజువనేషన్. దీనికోసం చైనీస్ స్కిన్ ఎక్స్‌ఫాలియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. షెల్ పౌడర్ లేదా గుడ్డు పొట్టుతో చేసిన పౌడర్‌లో తేనె, గుడ్డు సొన కలిపి ముఖాన్ని స్క్రబ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగి చర్మం తాజాగా ఉంటుంది.
అందమైన స్కిన్ కోసం చైనీస్ హెర్బల్ టీలు ఎక్కువగా తాగుతారు. పాలు కలపని టీలు వాళ్ల రొటీన్‌లో భాగంగా ఉంటాయి. చాలామంది చైనీస్ అమ్మాయిలు క్రమం తప్పకుండా నిమ్మరసం, తేనె కలిపిన గ్రీన్ టీ తాగుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
ఇన్ స్టంగ్ గ్లో కోసం చైనీస్ మింట్ ఫేస్ ప్యాక్ ఎక్కువగా వాడతారు. పుదీనా ఆకులను పేస్ట్‌గా చేసి ముఖాన్ని రాసుకుని పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. బయటకు వెళ్లేముందు ఈ మాస్క్ వేసుకుంటే మరింత ఫ్రెష్‌గా కనిపించొచ్చు.
ముడతలు లేని చర్మం కోసం చైనీయులు జేడ్ రోలర్ అనే పరికరాన్ని వాడతారు. ఈ రోలర్‌తో ముఖాన్ని మృదువుగా మసాజ్ చేయడం వల్ల చర్మం పైపొరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముడతలను తగ్గించి స్కిన్‌ను టైట్ చేస్తుంది.
వీటితోపాటు చైనీయులు పెసర్లతో చేసిన ఫేస్ ప్యాక్, పసుపు ఫేస్ ప్యాక్స్ వంటివి కూడా ఎక్కువగా వాడతారు. అందమైన స్కిన్ కోసం డైట్‌లో భాగంగా కూరగాయలు, బెర్రీ పండ్లు ఎక్కువగా తింటారు. రకరకాల హెర్బ్స్ తో చేసిన టీలు తాగుతారు. అంతేకాదు, చర్మ సౌందర్యానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం అని చైనీయులు నమ్ముతారు. అందుకే స్కిన్ రొటీన్‌లో భాగంగా నీళ్లు ఎక్కువగా తాగుతారు.