ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం దుర్మార్గమని తెలంగాణ గెజిటెడ్, ఫోర్త్ క్లాస్, టీచర్స్, పెన్షనర్స్ జేఏసీ నాయకులు అన్నారు. జేఏసీ, ట్రెసా పిలుపుమేరకు గురువారం లంచ్ టైంలో సీసీఎల్‌ఏలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు కలెక్టర్, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారని తెలిపారు. వారిపై దాడులకు దిగడం ప్రజలు, యువతను అభివృద్ధికి దూరం చేసే ప్రయత్నమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారితో పాటు వెనుక ఉండి రెచ్చగొట్టిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎలూరి శ్రీనివాస రావు, వంగ రవీందర్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్, సత్యనారాయణ, చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, శ్యాం, గౌతమ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, గోల్కొండ సతీశ్, కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, మంజుల, సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Previous Articleరంజీ ట్రోఫీ.. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు
Next Article నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్ విడుదల
Keep Reading
Add A Comment