వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతిచెందగా, ఒకరు ప్రాణాలతో బయట పడ్డారు. హైదరాబాద్‌లోని హయత్ నగర్ కు చెందిన స్నేహితులు మణికంఠ, వంశీ, దినేశ్, హర్ష, బాలు, వినయ్ కారులో వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు సమీపంలోని చెరువులో దూసుకెళ్లింది. స్థానికులు కారులోని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మణికంఠ ఒక్కరే ప్రాణాలతో బయట పడగా మిగిలిన ఐదుగురు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Previous Articleఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు
Next Article అడిలైడ్ టెస్ట్.. రెండు వికెట్లు పడగొట్టిన బూమ్రా
Keep Reading
Add A Comment