ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 30న ఉదయం 11.30 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్‌పై కేంద్రం అఖిలపక్షానికి వివరించనున్నది. అదానీ వ్యవహారం, అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలతో విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో ఆ సమావేశాలు వాయిదాలు, నిరసనలతోనే ముగిశాయి . అందుకే ఈసారి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరనున్నది. ఈనెల 31న పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తూ.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Add A Comment