లోక్‌సభ ప్రవేశ ద్వారం దగ్గర జరిగిన ఘటన కారణంగా ఒక ఎంపీకి చిన్న దెబ్బ తగిలితే బీజేపీ కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ క్యారెక్టర్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. ఆయనను నేరస్తుడు అంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం శాసన మండలి మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ లోపలికి వెళ్తున్న సమయంలో ప్రధాన ద్వారం దగ్గర ఆయనకు అడ్డంగా నిలబడ్డారని.. వారిని పక్కకు జరుపుతూ వెళ్లే సమయంలో పక్కనే ఉన్న ఎంపీ కాకుండా మరో సభ్యుడు కింద పడ్డారని.. ఆయనకు చిన్న దెబ్బ తాకిందని తెలిపారు. దీనికే రాహుల్ గాంధీపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించారని, ఆయనపై చర్యలు తీసుకోకుండా రాహుల్ గాంధీ నోరు మూయించేలా హత్యాయత్నం కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ పై కేసును ఉపసంహరించుకొని, అంబేద్కర్ ను అవయానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Previous Articleస్టాక్ మార్కెట్లు క్రాష్.. రూ.9 లక్షల కోట్లు ఉఫ్
Next Article అడవి బిడ్డలు అంటే చాలా ఇష్టం : పవన్ కల్యాణ్
Keep Reading
Add A Comment