ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన వీరుడు బీర్సా ముండా 150వ జయంత్యుత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ”జన్ జాతీయ గౌరవ దివస్” గా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. నిరుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ “దర్తి ఆబ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్” పథకాన్ని ప్రారంభించారని, రాబోయే ఐదేళ్లలో దేశంలోని గిరిజనులకు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక అభివృద్ధి, అటవీ హక్కులు తదితర విషయాల్లో సమతుల్యత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణలోని ములుగులో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, అదే రోజు అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బీర్సా ముండా జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడుతారని అధికారులు వెల్లడించారు.
Previous Articleమాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు
Next Article ‘జన్ జాతీయ గౌరవ దివస్”గా బీర్సా ముండా జయంతి
Keep Reading
Add A Comment