అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో గణేష్ అనే యువకుడు ఓ యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. గాయాలపాలైన బాధితురాలని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిందిడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా గుర్తించారు.
Previous Articleవాలంటైన్స్ డే రోజు అమానుషం.. యువతిపై యాసిడ్ దాడి
Next Article ఫిబ్రవరి 19న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!
Keep Reading
Add A Comment