Telugu Global
Travel

కుంభమేళా భక్తుల కోసం వాట్సప్‌ సేవలు

కుంభమేళా టూర్‌ ప్యాకేజీ సహా సమస్త వివరాలు మొబైల్‌లో అందుబాటులో

కుంభమేళా భక్తుల కోసం వాట్సప్‌ సేవలు
X

ఉత్తరప్రదేశ్‌ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించే మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించాలనుకుంటున్న భక్తుల కోసం వాట్సప్‌ సేవలు అందుబాటులోకి తెచ్చాచరు. కుంభ్‌ సహాయక్‌ ఏఐ పేరుతో ఈ వాట్సప్‌ సేవలు అందించనున్నారు. 8887847135 నంబర్‌ కు ఇంగ్లిష్‌ లో హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేస్తే కుంభమేళాకు సంబంధించిన సమస్త వివరాలతో పాటు టూర్‌ ప్యాకేజీలు, అక్కడ భోజనం, వసతి సౌకర్యాలు, ప్రయాగ్‌రాజ్‌ కు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, వాటిని సందర్శించుకోవాలనుకునే వారు ఎలా ప్లాన్‌ చేసుకోవాలి.. అందుకోసం ఎలాంటి ప్యాకేజీలు ఉన్నాయనే వివరాలన్నీ ఈ వాట్సప్‌ ద్వారా అందించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కుంభమేళాకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్న వాళ్లు.. ఇంకే హాయ్‌ ఒక మెసేజ్‌ పెట్టేయండి.. మీకు కావాల్సిన సమాచారమంతా మీ మొబైల్‌ లో ప్రత్యక్షమవుతుంది.

First Published:  31 Dec 2024 3:18 PM IST
Next Story