Telugu Global
Travel

సిటీకి దగ్గర్లో వీకెండ్ అడ్వెంచర్స్ స్పాట్స్!

సెలవుల్లో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దానికోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు హైదరాబాద్ చుట్టుపక్కలే కొన్ని అడ్వెచర్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి.

సిటీకి దగ్గర్లో వీకెండ్ అడ్వెంచర్స్ స్పాట్స్!
X

సెలవుల్లో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దానికోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు హైదరాబాద్ చుట్టుపక్కలే కొన్ని అడ్వెచర్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అవేంటంటే..

వీకెండ్ వెకేషన్‌లో భాగంగా ఒకట్రెండు రోజుల ట్రిప్ వెళ్లాలనుకునేవారికి సిటీకి దగ్గర్లోనే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ స్పాట్స్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి.

అనంతగిరి హిల్స్‌: వికారాబాద్‌ టౌన్‌కు పక్కనే ఉండే అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎండలు తగ్గుతున్న ఈ సీజన్‌లో ఇక్కడ ట్రెకింగ్‌ చేయొచ్చు. ఇక్కడ క్యాపింగ్ చేసేందుకు, స్టే చేసేందుకు కొన్ని రిసార్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

భువనగిరి ఫోర్ట్ : హైదరాబాద్‌ సిటీకి వంద కిలో మీటర్ల దూరంలో భువనగిరి ప్రాంతానికి ఎంతో చరిత్రం ఉంది. ఇక్కడ ఉండే 600 మీటర్ల ఏకశిల రాతిపై భువనగిరి కోట ఉంటుంది. చుట్టుపక్కల 40 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ కొండ ప్రాంతంలో రకరకాల పిక్‌నిక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాపింగ్, ట్రెకింగ్‌ వంటివి కూడా చేయొచ్చు.

పోచారం డ్యామ్: హైదరాబాద్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే పోచారం ఏరియా అడవులు, సరస్సులతో అందంగా ఉంటుంది. ఇక్కడి డ్యామ్ ఏరియాలో క్యాపింగ్ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పోచారం లేక్‌లో బోటింగ్ వంటి అడ్వెంచర్స్‌తో పాటు అటవీ ప్రాంతంలో రకరకాల జంతువులను కూడా చూడొచ్చు.

లక్నవరం లేక్: హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్నవరం సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ఏటూరునాగారం అడవిలో వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్, కయాకింగ్ , రోప్‌వే క్రాసింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.

First Published:  11 Jun 2024 9:04 AM IST
Next Story