భూటాన్‌లో బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ
అనేక ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని, తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలను త్వరలో సందర్శిస్తామని భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధి, ఐ-డిజైర్ అధినేత పరశురాం బిస్వా చెప్పారు.
భూటాన్ లోని ధింపూ నగరంలో ఆదివారం నాడు జరిగిన అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సు ముగింపు సభలో నాగార్జునసాగర్‌లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ జరిగిందని బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ మరియు భూటాన్ పర్యాటక సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలు మరియు బుద్ధవనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనేక ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని, తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలను త్వరలో సందర్శిస్తామని భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధి, ఐ-డిజైర్ అధినేత పరశురాం బిస్వా చెప్పారు.
సదస్సు ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయల్ భూటాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు, డాక్టర్ సౌరవ్ బసు, ఏబిటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ బుద్దవనం బ్రోచర్‌ను ఆవిష్కరించగా, శివనాగిరెడ్డి ప్రతినిధులకు బ్రోచర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ దేశాల స్థానిక ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారని శివనాగిరెడ్డి చెప్పారు.