Telugu Global
Travel

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! రూట్స్ వివరాలివే..

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌‌టీసీ.

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! రూట్స్ వివరాలివే..
X

సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది! ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా ఉంటాయి.

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌‌టీసీ. ఇందులో రకరకాల రూట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు , బాపట్ల సూర్యలంక బీచ్‌లను కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుంచి సర్క్యూ్ట్ బస్సు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ, గుంటూర, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ మీదుగా మరో టూర్ కూడా అందుబాటులో ఉంది.

శ్రీశైలం వెళ్లాలనుకునేవారికోసం హైదరాబాద్, కర్నూలు నుంచి పలు సర్క్యూట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ తిరిగి కర్నూలు చేసుకునే బస్సు, కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ కర్నూలు చేరుకునే బస్సు, కర్నూలు నుంచి మంత్రాలయం అప్ అండ్ డౌన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

విశాఖపట్నం నగర వాసుల కోసం వైజాగ్ సిటీ టూర్ బస్సు, అలాగే విశాఖపట్నం నుంచి అరకు తీసుకెళ్లి తీసుకొచ్చే బస్సు, వైజాగ్ నుంచి అరసవెల్లి, శ్రీకాకుళం తీసుకెళ్లి తీసుకొచ్చే బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి.

పంచారామ క్షేత్రాలను ఒకే ట్రిప్‌లో కవర్ చేస్తూ విజయవాడ నుంచి మరో బస్సు సర్వీస్ అందుబాటులో ఉంది. విజయవాడ నుంచి అమరావతి మీదుగా భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం ప్రాంతాలను కవర్ చేసుకుని తిరిగి విజయవాడ చేరుకుంటుంది. అలాగే రాజమహేంద్రవరం నుంచి దాక్షారామం, పిఠాపురం, అన్నవరం ప్రాంతాలను కవర్ చేసే మరో బస్సు టూర్ కూడా అందుబాటులో ఉంది.

కడప నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం టూర్స్‌కు ఒక సర్క్యూట్ బస్సు, కడప నుంచి కదిరి,- లేపాక్షి ప్రాంతాలకు మరో బస్సు అందుబాటులో ఉంది. ఈ బస్సు టికెట్లను నేరుగా బస్ స్టేషన్లలో కొనుగోలు చేయొచ్చు.

First Published:  6 March 2024 12:30 AM GMT
Next Story