మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన వేణుస్వామి
నాగచైతన్య, శోభితల వివాహంపై గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతో మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి క్షమాపణ కోరారు.
గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని న వేణు స్వామి జోష్యం చెప్పారు. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామి కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీసింది. కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణి స్వామికి మరోసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరై హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. మహిళా కమిషన్ ను క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని మహిళా కమిషన్ వేణు స్వామిని హెచ్చరించింది.