Telugu Global
Telangana

బీఆర్‌ఎస్‌ పాలనలో సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి

ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్‌ఎస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని భట్టి ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ పాలనలో సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి
X

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక రూ. 52 వేల కోట్ల అప్పు చేశాం. చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకే కట్టే పరిస్థితికి తెచ్చారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలకు రూ. 61 వేల కోట్లు వెచ్చించామన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్య శ్రీ పథకాలకు నిధులు కేటాయించామన్నారు. ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్‌ఎస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలోనే కొత్త విద్యుత్‌ విధానం ప్రకటిస్తామన్నారు. అందరూ వద్దంటున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భద్రాద్రి విద్యుత్‌ ప్రాజెక్టు కట్టింది. కేంద్రం జాప్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టుపై 42 శాతం అదనపు భారం పెరిగింది. ప్రాజెక్టుపై పెరిగే ధరలన్నీ కలిపి అంతిమంగా ప్రజలపై భారం వేశారు. విద్యుత్‌ రంగం గురించి చాలా దుష్ప్రచారం చేశారు. మీరు చేసిన తప్పుడు ప్రచారాన్ని మేం సమర్థవంతంగా తిప్పికొట్టాం. విద్యుత్‌ విషయంలో సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచామని భట్టి తెలిపారు. గత ఏడాది కంటే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం. మేం వచ్చాక విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు గుర్తించామన్నారు. ఉత్పత్తి కేంద్రాల సమాచారమంతా ప్రజలకు చెప్పాం. థర్మల్‌ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నదని భట్టి వివరించారు.

First Published:  6 Dec 2024 4:33 PM IST
Next Story